చిరు సినిమాలో మహేష్ రెమ్యూనరేషన్, వింటే మతిపోవాల్సిందే.

Published on Feb 29, 2020 1:11 pm IST

చిరంజీవి తన 152వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో కమిట్ అయ్యారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దసరా లేదా దీపావళి కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు. ఇక ఈ చిత్రంలో మహేష్ ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే అరగంట నిడివి కలిగిన ఈ పాత్ర కోసం మహేష్ ఏకంగా 30కోట్ల పారితోషికం తీసుకున్నారట. టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న వారు సైతం పూర్తి సినిమాకు ఇంత మొత్తం తీసుకోవడం లేదు. దీనితో చిరు సినిమా కొరకు మహేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దర్శకుడు కొరటాల కమర్షియల్ అంశాలు కలిగిన సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. చిరంజీవితో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు పనిచేసిన మణిశర్మ చాలా కాలం తరువాత చిరు మూవీకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More