మహేష్ నుంచి మరో స్టన్నింగ్ లుక్ వైరల్.!

మహేష్ నుంచి మరో స్టన్నింగ్ లుక్ వైరల్.!

Published on Oct 26, 2021 4:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్స్ కోసం తెలుగు ఆడియెన్స్ కి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.. ఎప్పుడో తాను టాలీవుడ్ లెవెల్ హీరో కాదు హాలీవుడ్ లెవెల్ హీరో అని మార్క్ తెచ్చుకున్నాడు. అయినా కూడా మహేష్ మాత్రం కొన్నాళ్ల వరకు టాలీవుడ్ కే అంకితం బాలీవుడ్ లో కూడా అప్పుడే వెళ్ళేది లేదు అని చెప్పారు. దీనితో మహేష్ పాన్ ఇండియా వైడ్ ఎంట్రీ కోసం చాలా మందిలో ఆసక్తి నెలకొంది.

అలాగే మరోపక్క తన సినిమా సినిమాకు లుక్స్ పరంగా మహేష్ ఆశ్చర్య పరుస్తూనే వస్తున్నారు. లేటెస్ట్ గా సర్కారు వారి పాట సినిమాకి అయితే జస్ట్ తన లుక్స్ తోనే వేరే లెవెల్ ట్రీట్ ని మహేష్ అందిస్తున్నారు. ఆల్రెడీ సినిమాలోని సెట్స్ లోని కొన్ని ఫోటోలు బయటకొచ్చి వైరల్ కాగా లేటెస్ట్ గా ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ మహేష్ ది సర్కారు వారి పాట సెట్స్ నుంచి ఉన్నది ఒకటి షేర్ చేసాడు.

బ్లాక్ అండ్ వైట్ లో ఓ పక్క స్టైలిష్ గా మరోపక్క స్టన్నింగ్ గా మహేష్ ఇందులో కనిపిస్తున్నారు. దీనితో ఈ సరికొత్త ఫోటో మహేష్ ఫ్యాన్స్ కు టాలీవుడ్ ఆడియెన్స్ కి మరింత కిక్ ఇస్తుంది. ఇక మహేష్ రాజమౌళితో చేసే సినిమాకి దానికి ముందు త్రివిక్రమ్ తో చేసే సినిమాకి ఎలా రెడీ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు