సూపర్ స్టార్ కోసం ‘సర్కారు’ నుండి గ్లింప్స్‌ !

Published on May 25, 2021 12:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’ నుండి ‘సూపర్ స్టార్ కృష్ణ’కు పుట్టిన రోజు గిప్ట్ ఇవ్వడానికి మహేష్ అండ్ ‘సర్కారు వారి పాట’ టీమ్ ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. మొదట ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. ఇప్పటివరకూ షూట్ చేసిన సీన్స్ లో టీజర్ ను క‌ట్ చేసేంత ఫుటేజ్ లేదట. అందుకే ఈ సినిమా నుండి 30 సెక‌న్ల‌ గ్లింప్స్‌ని క‌ట్ చేసి సూపర్ స్టార్ కృష్ణకు బ‌ర్త్ డే విషెష్ చెబుతూ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందట. అంటే తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ సినిమా నడుస్తోందట. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :