మరో చిన్నారి గుండెకు ఆయుష్షు పోసిన మహేష్.!

Published on Mar 9, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం ఆన్ స్క్రీన్ పై రీక్ హీరోగా మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో రియల్ హీరో అని కూడా తెలిసిందే. ఇప్పటి వరకు తన సంపాదనలో కొంత మేర నిస్సహాయుల కోసం ఖర్చు పెడుతున్నాడు. మరి ఇందులో భాగంగా మహేష్ గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు ఆర్ధికంగా వైద్యం చేయించుకునే స్థోమత లేని వారికి మహేష్ ఒక ఆపద్బాంధవుడిలా కనిపించారు.

అయితే ఇప్పటికే 1000 మందికి పైగా చిన్నారి గుండెలకు ఊపిరి పోసిన మహేష్ మరో చిన్నారి గుండెకు ఆయుష్షు పోసినట్టుగా మహేష్ భార్య నమ్రత తెలిపారు. అంకిత్ భార్గవ్ అనే చిన్నారికి హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి కావడం ఆనందంగా ఉందని ఇప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని ఇక ముందు కూడా ఇలాగే ఉండాలని ఆమె ఆకాంక్షించారు. మరి మరోపక్క మహేష్ ఇప్పుడు తన మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :