నైజాంలో మరో రికార్డు కొల్లగొట్టిన మహేష్.

Published on Jan 20, 2020 9:09 am IST

సూపర్ స్టార్ మహేష్ నైజాంలో కింగ్ అనిపించుకున్నారు. వరుసగా రెండు సార్లు నైజాంలో 30కోట్ల మార్కును దాటివేశారు. సంక్రాంతి మూవీగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు నిన్న ఆదివారం వసూళ్లు దుమ్మురేపింది. నిన్న నైజాంలో 2 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన సరిలేరు నీకెవ్వరు మొత్తంగా 32.1 కోట్ల షేర్ వసూళ్లకు చేరింది. ఇది మహేష్ కి వరుసగా రెండవ 30 ప్లస్ క్రోర్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మహేష్ నటించిన గత చిత్రం మహర్షి 30కోట్ల షేర్ అధిగమించింది. నైజాంలో మహర్షి సినిమా మహేష్ హైయెస్ట్ గా ఉండగా సరిలేరు నీకెవ్వరు దానిని అధిగమించింది. సరిలేరు నీకెవ్వరు రన్ పూర్తయ్యే నాటికి 35 కోట్లకు పైగా చేరుకునే అవకాశం కలదు.

దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ అన్ని కలగలిపి ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. మహేష్ సరసన రష్మిక మందాన నటించగా విజయశాంతి కీలక రోల్ చేశారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించగా దేవిశ్రీ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More