అది చదివిన మహేష్ ఎగ్జయిట్ అయ్యారట.

Published on Apr 10, 2020 1:45 pm IST

కరోనా వైరస్ కారణంగా సెలెబ్రిటీల నుండి సామాన్యుల వరకు స్వచ్ఛంద కర్ఫ్యూ పాటిస్తున్నారు. అందుకే ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ తన ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారలతో ఆడుకుంటున్నారు . అలాగే నచ్చిన సినిమాలు, సిరీస్ లు చుస్తున్నారు. పుస్తకాలు కూడా చదువుతున్న మహేష్ తనని ఎగ్జయిట్ చేసిన ఓ పుస్తకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. పిక్ ఆఫ్ ద డే అని యువాల్ నోవా హరారి రాసిన ‘సెపియెన్స్’ అనే పుస్తకాన్ని పోస్ట్ చేశారు.

అలాగే పుస్తకం గురించి ప్రస్తావిస్తూ ఓ పక్క మంచి అనుభూతిని పంచుతూనే జ్ఞానం, కనువిప్పు కలిగించే పుస్తకం అన్నారు. మహేష్ లాంటి స్టార్ ని ఆకట్టుకున్న పుస్తకంలో చాల విషయం ఉండి ఉండాలి. ప్రొఫెసర్ హరారి రాసిన సెఫియెన్స్ వేల ఏళ్లుగా మానవ జాతి మనుగడ, పరిణామక్రమం, ప్రస్తుత హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ వంటి అనేక విషయాలను ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా సాగుతుంది.

సంబంధిత సమాచారం :

X
More