చివరిగా మనం చేయగలిగింది అదే-మహేష్

Published on May 22, 2020 2:37 pm IST


సూపర్ స్టార్ మహేష్ ఓ ఇంపార్టెంట్ మెస్సేజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన అందరినీ తప్పక మాస్క్ ధరించ వలసినదిగా కోరుకున్నారు. చిన్నగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఐతే మనం బయటికి వెళ్లే టప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్లే టప్పుడు మాస్క్ ధరించి మిమ్ముల్ని మరియు మీ చుట్టూ ఉన్నవారిని కాపాడండి అని కోరుకున్నాడు. ఆ ట్వీట్ లో ఆయన మాస్క్ ధరించి ఉన్న ఫోటో షేర్ చేయడం విశేషం.

దేశంలో కరోనా కేసుల విజృంభణ తగ్గినప్పటికీ ప్రజల అవసరాల రీత్యా సడలింపులు ఇవ్వాల్సి వస్తుంది. దీనితో ప్రభుత్వాలు ప్రజలు బయటికి వెళ్లే వెసులుబాటు కలిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి అని మహేష్ గుర్తుచేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మహేష్ ఇలా తన సామజిక బాధ్యత నెరవేరుస్తున్నారు. ఇక కొద్దిరోజులలో మహేష్ తన కొత్త చిత్ర ప్రకటన చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More