నాన్నకు ప్రేమతో మహేష్ స్పెషల్ విషెష్.!

Published on May 31, 2021 8:00 am IST

ఈరోజు మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లెజెండరు హీరోలలో ఒకరైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు కావడంతో నిన్న సాయంత్రం నుంచే సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఆ సూపర్ స్టార్ తనయుడు ప్రిన్స్ మహేష్ మహేష్ బాబు తన ప్రేమతో కూడిన శుభాకాంక్షలు తెలియజేసారు.

“జన్మదిన శుభాకాంక్షలు నాన్న. నాకు ఎప్పుడూ ఉన్నతమైన దారినే చూపిస్తున్న మీకు థాంక్స్ తెలియజేస్తున్నాను. మీకు తెలిసిన దానికంటే ఎక్కువే నా ప్రేమ మీ మీద ఉంటుంది” అని మహేష్ తన స్పెషల్ విషెష్ ను తెలిపారు. మరి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ పెట్లతో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :