‘జూన్’లో మహేష్ తో సుకుమార్ ?

Published on Jan 5, 2019 9:11 am IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి మొదలు కానుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మే నుండి మొదలు కానుందని తెలుస్తోంది.
మహేష్ ఈ సినిమాకు జూన్ నుండి వరుసగా డేట్లు ఇచ్చారట. మహేష్ కాంబినేషన్ లో ఉన్న సీన్లను జూన్ నుండి ఫారెన్ లొకేషన్స్ లో షూట్ చేయనున్నారని సమాచారం.

ఇక మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో కథానాయకగా నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ.. చిత్రబృందం మాత్రం స్టార్ హీరోయిన్ని ఫైనల్ చేసే పనిలో వుంది. ఇక రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను తయారు చేశారట. సుకుమార్ చెప్పిన కథ మహేష్ బాబుకు బాగా నచ్చిందట.

సంబంధిత సమాచారం :

X
More