‘శ్రీమంతుడు’పై సూపర్ కాన్ఫిడెంట్ తో ఉన్న మహేష్

‘శ్రీమంతుడు’పై సూపర్ కాన్ఫిడెంట్ తో ఉన్న మహేష్

Published on Jul 25, 2015 5:00 PM IST

Srimantudu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ డబ్బింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. అలాగే శ్రేమంతుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా జరిగిన సినీ మా అవార్డ్స్ లో కూడా శ్రీమంతుడుని ప్రమోట్ చేసారు. ఇదంతా పక్కన పడితే ఈ సినిమా సక్సెస్ పై మహేష్ బాబు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ ‘నా ప్రతి సినిమా రిలీజ్ టైంలో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవాలనే ప్రెజర్ నాకు కూడా ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకి బాగా నచ్చుతుందన్న నమ్మకం ఉందని’ తెలిపాడు.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ కాపీని జూలై 30 కల్లా రెడీ చేసి జూలై 31న సెన్సార్ కి పంపనున్నారు. సెన్సార్ పూర్తి కాగానే ప్రింట్స్ వర్క్ ని ఫినిష్ చేసి ఆన్ టైం ప్రింట్స్ ని డిస్పాచ్ చేస్యనున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. మిర్చి తర్వాతకొరత శివ చాలా గ్యాప్ తో పాటు, మహేష్ అభిమానులను శాటిస్ఫై చేసేలా ఈ సినిమా స్క్రిప్ట్ ని పక్కాగా రెడీ చేసాడు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఆగష్టు 7న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

తాజా వార్తలు