మిలియనీర్ కొడుకుగా మహేష్ బాబు..?

మిలియనీర్ కొడుకుగా మహేష్ బాబు..?

Published on Mar 3, 2015 12:43 PM IST

mahesh-babu
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ టైటిల్ కు తగ్గట్టు మహేష్ బాబు మిలియనీర్ కొడుకుగా కనిపిస్తాడట. సరికొత్త హెయిర్ స్టైల్, అల్ట్రా మోడరన్ లుక్ లో సూపర్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో సందడి చేస్తాడని యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మహేష్ బాబు తండ్రిగా జగపతి బాబు నటిస్తున్నారు. ఈ సినిమా పొల్లాచ్చి షెడ్యూల్ నేటితో పూర్తవుతుంది. త్వరలో హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు.

మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పూర్ణ ప్రత్యేక గీతంలో నర్తించింది. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, సివి మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు