18 నుంచి ఆగడు పై దృష్టి పెట్టనున్న మహేష్

Published on Jan 16, 2014 4:20 pm IST

Mahesh-Babu-Aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు మరో రెండు రోజుల్లో తిరిగి తన ఫోకస్ ని ‘ఆగడు’ సినిమాపై పెట్టనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. అలాగే మహేష్ కూడా కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు. సంక్రాంతి విరామం తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ జవరి 18 నుంచి ప్రారంభం కానుంది. మహేష్ బాబు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు.

మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లో కనిపించనున్న ఈ రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే తమన్నా పాత్ర చాలా కామెడీగా ఉంటుందని సమాచారం. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :