మహేష్ చేతుల మీదగా “లవ్ స్టోరీ” నుంచి మరో చార్ట్ బస్టర్.!

Published on Mar 24, 2021 10:10 am IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ” రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాగే శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ఆడియో ఎంత పెద్ద హిట్టవుతుందో కూడా అందరికీ తెలుసు.

“హ్యాపీ డేస్” నుంచి ఇప్పుడు లవ్ స్టోరీ వరకు ఆడియో పరంగా కమ్ముల అభిరుచి ఏంటో తెలిసింది. అలా ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ సాంగ్ కూడా హిట్టయ్యింది. మరి దీనికి ఇంకో సెంటిమెంట్ కలుస్తుంది. ఇటీవల కాలంలో సూపర్ స్టార్ మహేష్ నుంచి ఆడియో పరంగా ఏదన్నా సాంగ్ లాంచ్ చేస్తే అది పెద్ద హిట్ అవుతుంది.

మరి ఇప్పుడు ఈ చిత్రం నుంచి “ఏవో ఏవో కలలే” అనే సాంగ్ ను మహేష్ చేత రేపు మార్చ్ 25న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసారు. మరి ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్టవుతుందో చూడాలి. పవన్ సి హెచ్ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 16న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :