ద్విపాత్రాభినయంలో మహేష్ బాబు??

ద్విపాత్రాభినయంలో మహేష్ బాబు??

Published on Dec 6, 2015 2:06 PM IST

mahesh-babu
ఈ ఏడాది ‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత కాస్త హాలిడే గ్యాప్ తీసుకొని ఫుల్ ప్లెడ్జ్ గా తన తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శ్హోటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 10 నుంచి ఊటీలో న్యూ షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నారు. ఈ బ్రహ్మోత్సవం సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అలాగే అదే నెలలోనే ఎఆర్ మురుగదాస్ తో మహేష్ చేయనున్న తదుపరి సినిమాని కూడా లాంచ్ చేయనున్నారు.

ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా గురించిన మరో ఆసక్తికర విషయం తెలిసింది. మహేష్ బాబు ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడని ఈ చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం మహేష్ బాబు తన కెరీర్లో మొట్ట మొదటి సారిగా ఫుల్ లెంగ్త్ డబుల్ రోల్ సినిమా చేయనున్నాడు. గతంలో నాని సినిమా క్లైమాక్స్ లో మాత్రమే డబుల్ రోల్ లో కనిపించాడు. 2106 ఏప్రిల్ 12న ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ సినిమాని కూడా బ్రహ్మోత్సవం తరహాలోనే తెలుగు తమిళ భాషల్లో షూట్ చేయనున్నారు. మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాని ఎన్.విప్రసాద్ – ఠాగూర్ మధులు కలిసి నిర్మించనున్నారు. 5 సార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్న సంతోష్ శివన్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు