ప్రమోషన్లు మొదలుపెట్టనున్న మహేష్ !

16th, April 2018 - 12:37:48 PM


సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ ఈ నెల 20న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులు పూర్తికాగా రేపటి నుండి పూర్తిస్థాయి ప్రమోషన్లు మొదలుపెట్టనున్నారు టీమ్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రేపే పారిస్ నుండి హైదరాబాద్ తిరిగిరానున్నారు.

గతంలో మహేష్ తో బ్లాక్ బస్టర్ ‘శ్రీమంతుడు’ను రూపొందించిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం, టీజర్, ట్రైలర్, ఆడియో అన్నీ బాగుండటంతో చిత్రంపై భారీస్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఓవర్సీస్లో కూడ మహేష్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండటంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు 2000ల ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు.