సూపర్ స్టార్ మహేష్ బాబు వర్క విషయంలో ఎప్పుడూ హడావుడి ప్రదర్శించరు. సినిమాల్ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేసుకుంటూ వెళతారు. సినిమా సినిమాకి మధ్యన హెల్తీ గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. ఆ విరామంలో కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లిపోతారు. కానీ గత చిత్రం ‘మహర్షి’ తర్వాత మహేష్ పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. సినిమా కోసం ఎప్పుడూ లేనంతగా ప్రమోషన్స్ చేశారు. ఆ తర్వాత వెంటనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సరిలేర నీకెవ్వరు’ చిత్రాన్ని స్టార్ట్ చేసేశారు.
చిత్రీకరణ మధ్యలో కూడా పెద్దగా సెలవులు తీసుకోలేదు. అందుకే సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకొని కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని
చూస్తున్నారట. ఈ విరామంలోనే ఆయన తన తర్వాతి సినిమా ఏమిటనేది ఫైనల్ చేసుకుని అనౌన్స్ చేస్తారట. ఇకపోతే మహేష్ తర్వాత సినిమా ఎవరితో చేస్తారు అనే విషయంలో వంశీ పైడిపల్లి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.


