మహేష్, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఉండొచ్చు ?

Published on Apr 14, 2021 12:13 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్నారు. అది పూర్తవ్వగానే ఏ సినిమా చేస్తున్నదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇండస్ట్రీ వర్గాల్లో అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలోనే మహేష్ తర్వాతి సినిమా చేయవచ్చని బలమైన టాక్ వినబడుతోంది. త్రివిక్రమ్ అనేసరికి అభిమానులు కూడ బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ఎందుకంటే వీరిద్దరి కలయికలో గతంలో ‘అతడు, ఖలేజా’ చిత్రాలు రావడం జరిగింది. రెండు సినిమాలు కమర్షియల్ గా అంతగా మెప్పించలేకపోయినా మహేష్ బాబు కెరీర్లో మాత్రం గుర్తుండిపోయే సినిమాలయ్యాయి.

అందుకే వీరిద్దరి కాంబినేషన్ మీద అంత ఆసక్తి. పైగా త్రివిక్రమ్ ‘అరవింద సమేత, అల వైకుంఠపురములో’ లాంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ చేసి ఉన్నారు. కాబట్టే ఈసారి మహేష్ బాబుతో చేయబోయే సినిమాను తప్పకుండా గొప్పగానే తీస్తారని నమ్ముతున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినా మహేష్ తర్వాతి సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తేనే బాగుంటుందని అంటున్నారు. ఇక తాజా ఇన్ఫర్మేషన్ మేరకు మే 31న ఈ వీరి ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే నిజమైతే అభిమానులకు అంతకన్నా ఎగ్జైటింగ్ న్యూస్ వేరే ఉండదు.

సంబంధిత సమాచారం :