సౌత్ ఇండియాలోనే ఒకే ఒక్కడుగా మహేష్..!

Published on Jul 2, 2020 2:30 pm IST

ప్రజలపై అత్యంత ప్రభావం కలిగిన సోషల్ మీడియా మాద్యమాలలో ట్విట్టర్ ఒకటి. ట్విట్టర్ లో ఫాలోవర్స్ ను బట్టి హీరోల స్టార్ డమ్ క్రేజ్ అంచనా వేయవచ్చు. కాగా ట్విట్టర్ ఫాలోయింగ్ లో మహేష్ అరుదైన రికార్డు అందుకున్నాడు. మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 10 మిలియన్స్ కి చేరింది. అనగా ఆయనను ఓ కోటిమంది ట్విట్టర్ ద్వారా ఫాలో అవుతున్నారన్న మాట. ఈ ఘనతను అందుకున్న ఏకైన సౌత్ ఇండియా స్టార్ మహేష్ కావడం విశేషం.

సౌత్ నుండి 10 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన మొదటి హీరోగా మహేష్ నిలిచాడు. ఇక మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురాం తో చేస్తున్నారు . సర్కారు వారి పాట టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More