మహేష్ కన్ను ఆ బిజినెస్ పై పడిందా..?

Published on Apr 9, 2020 2:28 pm IST

https://cdn.123telugu.com/telugu/wp-content/uploads/2020/02/Mahesh-1.jpg
ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో వచ్చిన విప్లవాత్మక మార్పులలో ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఒకటి. కుటుంబ సమేతంగా థియేటర్ కి వెళ్లి సినిమా చూసే సంప్రదాయం మరుగున పడుతున్న తరుణంలో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ నేరుగా సినిమాలను ఇంటికి చేర్చుతున్నాయి. దీనితో అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, సన్ నెక్స్ట్ వంటి డిజిటల్ ప్లాట్ ఫాన్స్ కి ఆదరణ పెరిగింది. అందరికీ అందుబాటులో ఉండే సబ్స్క్రిషన్ ధరలు, కొత్త సినిమాలు రెండు మూడు వారాలలో అందుబాటులోకి రావడం, వెబ్ సిరీస్ లు వంటి అనేక సేవల వలన అందరూ వీటికి మొగ్గుచూపుతున్నారు.

ఈ నేపధ్యంలో బడా ప్రొడ్యూసర్స్ గా ఉన్న అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు వంటివారు ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు . అల్లు అరవింద్ ఇప్పటికే ఆహా పేరుతో ఒక ఓ టి టి ప్లాట్ ఫార్మ్ స్థాపించారు. కాగా ఈ రంగంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు అడుగుపెట్టాలని చూస్తున్నారట. ఆయన కూడా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ మాదిరి ఓ డిజిట్ల ప్లాట్ ఫార్మ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబందించి సన్నాహాలు ఆయన మొదలుపెట్టారని తెలుస్తుంది. కొద్దిరోజులలో మహేష్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక మహేష్ ప్రస్తుతం అనేక వ్యాపార ప్రకటనలకు ప్రచార కర్తగా ఉండగా, గార్మెంట్, మల్టీ ఫ్లెక్స్ బిజినెస్ లో ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More