విదేశాలకు మహేష్.. చాలా ప్రత్యేకమైన ట్రిప్ !

Published on May 20, 2019 5:09 pm IST

షూటింగ్ ముగిసినా, సినిమా విడుదలై రిజల్ట్ తెలిసినా మహేష్ బాబు వెంటనే ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లిపోతుంటారు. కానీ ఈసారి మాత్రం అలా చేయలేదు. ‘మహర్షి’ సినిమా విడుదలకు ముందు నుండి ప్రమోషన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలకు టీమ్‌తో కలిసి విరివిగా ఇంటర్వూలు ఇచ్చారు.

సినిమా విడుదలై హిట్ టాక్ వచ్చినా ప్రచారాన్ని ఆపలేదు. ఎప్పుడూ లేనిది థియేటర్ కవరేజ్ కూడా చేశారు. విద్యార్థులతో, రైతులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలా సినిమాను జనానికి దగ్గర చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. అవి మంచి ఫలితాల్ని ఇవ్వడంతో హాయిగా రిలాక్స్ అవ్వాలని ఈరోజు కుటుంబంతో కలిసి విహారానికి బయలుదేరారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే హాలీడే అని, చాలా ప్రత్యేకమైనదని ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More