ఏమైనా మహేష్ రియల్ హీరో..!

Published on Jul 8, 2020 11:51 am IST

మహేష్ ఎంత పెద్ద స్టార్ అయినా అందరినీ గౌరవిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. నేడు మహేష్ తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పంచుకున్నారు. ఆయన తన మేకప్ మెన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన వ్యక్తిగత మేకప్ మెన్ పట్టాభికి మహేష్ బర్త్ డే విషెష్ చెప్పడం విశేషమనే చెప్పాలి. అంత పెద్ద సూపర్ స్టార్ మేకప్ మెన్ బర్త్ డే గుర్తు పెట్టుకొని మరీ విషెష్ చెప్పడం అరుదైన విషయమే.

పట్టాభి మహేష్ పర్సనల్ మేకప్ మెన్ గా చాలా కాలంగా పని చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరుశురాం తో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ సెప్టెంబర్ లో మొదలుకానుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల గురించిన సబ్జెక్టు తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో మహేష్ పాత్రపై అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More