మోహన్ లాల్ కి బర్త్ డే విషెష్ చెప్పిన మహేష్

Published on May 21, 2020 3:43 pm IST

సూపర్ స్టార్ మహేష్ మలయాళ స్టార్ హీరో సీనియర్ నటులు మోహన్ లాల్ కి బర్త్ డే విషెష్ చెప్పారు. నేడు మోహన్ లాల్ పుట్టినరోజు కోవడంతో ట్విట్టర్ వేదికగా మహేష్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే మోహన్ లాల్ సర్, మీరు ఆయురారోగ్యాలతో ఎప్పుడూ బాగుండాలని కాంక్షించారు. నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ఆయనకు బర్త్ డే విషెష్ చెప్పారు. తోటి హీరోల పట్ల మహేష్ తన అభిమానం, ప్రేమ ఈ విధంగా చాటుకుంటున్నారు.

ఇక మహేష్ కొత్త చిత్ర ప్రకటన ఈనెల 31న ఉంటుందన్న వార్త గట్టిగా వినిపిస్తుంది. ఆ రోజు కృష్ణ గారి పుట్టిన రోజు కావడంతో ఆ రోజు నూతన చిత్ర ప్రకటన చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. మహేష్ దర్శకుడు పరుశురాం తో మూవీ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ స్పష్టమైన సమాచారం ఉంది. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి తన నెక్స్ట్ మూవీ మహేష్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More