మామయ్య దర్శకేంద్రుడికి మహేష్ బెస్ట్ విశెష్..!

Published on May 23, 2020 2:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. వారిద్దరూ కలిసి పనిచేసిన రాజకుమారుడు మూవీ ఆన్ లొకేషన్ పిక్ పంచుకొన్న మహేష్ మీ లాంటి జీనియస్ డైరెక్టర్ తో పనిచేసిన గొప్ప అనుభూతి ఎప్పటికీ మరిచిపోలేను అని చెప్పుకొచ్చారు. కాగా మహేష్ దర్శకుడు రాఘవేంద్ర రావుని మామయ్య అని సంబోధించడం విశేషం. 1999లో మహేష్ హీరోగా డెబ్యూ మూవీ రాజకుమారుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చేశారు.

రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రీతి జింటా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కృష్ణ క్యామియో రోల్ చేశారు. ఇక మణిశర్మ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. హీరోగా మహేష్ కి గట్టి పునాది వేసిన సినిమాకి దర్శకుడు రాఘవేంద్ర రావు కావడంతో మహేష్ ఎంతో అభిమానంగా బర్త్ డే విషెష్ చెప్పారు.

సంబంధిత సమాచారం :

X
More