
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘శ్రీమంతుడు’కి ‘మిర్చి’ ఫేం కొరటాల శివ డైరెక్టర్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ సూపర్బ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో రెండు రోజుల క్రితమే రిలీజ్ అయ్యి మంచి టాక్ ని తెచ్చుకుంటోంది. అలాగే ఆడియో ఫంక్షన్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
వారం రోజుల క్రితమే మహేష్ బాబు ఫస్ట్ హాఫ్ కి సంబందించిన డబ్బింగ్ ఫినిష్ చేసాడని తెలియజేశాం. ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు నేటి నుంచి శ్రీమంతుడు సెకండ్ హాఫ్ లో తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని మొదలు పెట్టాడు. మరో మూడు రోజుల్లో మహేష్ బాబు తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేయనున్నాడు. మరో వైపు ఎడిటింగ్, రీ రికార్డింగ్ వర్క్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. మహేష్ బర్త్ డే కానుకగా ఆగష్టు 7న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మైత్రి మూవీస్ వారు మహేష్ బాబుతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.