ట్రెండ్ సెట్ చేయడానికి సిద్దమైన మహేష్ బాబు !

25th, June 2018 - 06:46:20 PM

మహేష్ బాబు ప్రస్తుతం డెహ్రాడూన్ లో తన 25వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ కళాశాల విద్యార్థిగా కనిపించనున్నాడు. అందుకోసం గడ్డం పెంచి, హెయిర్ స్టైల్ మార్చిన సూపర్ స్టార్ డ్రెస్సింగ్ కూడ పూర్తిగా భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారట. అన్ని కాలేజ్ ఎపిసోడ్స్ లో ఆయన తన రెగ్యులర్ ప్లయిన్ షర్ట్స్ లో కాకుండా చెక్ షర్ట్స్ లోనే కనిపిస్తారట.

సినిమా విడుదల తర్వాత ఈ స్టైల్ మహేష్ అభిమానుల్లో, యువతలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్ లు కలిసి నిర్మిస్తుండగా ఇందులో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం మహేష్ యొక్క 25వ చిత్రం కావడం వలన అభిమానుల్లో, ప్రేక్షకుల్లో సక్సెస్ పై భారీ అంచనాలున్నాయి.