మహేష్ మల్టీప్లెక్స్ అప్డేట్ !

మహేష్ మల్టీప్లెక్స్ అప్డేట్ !

Published on Nov 28, 2018 9:22 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు , ఏషియన్ సినిమాస్ ల జాయింట్ వెంచర్ ‘ఏ ఎమ్ బి సినిమాస్’ హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో అదునాతన సౌకర్యాలతో నిర్మితమవుతుంది. ఇక ఈ మల్టీ ఫ్లెక్స్ నవంబర్ 29న ప్రారంభం కావాల్సి ఉండగా లేజర్ స్క్రీనింగ్ పనులు ఆలస్యం కావడం వల్ల వాయిదాపడింది. తాజాగా ఈ మల్టీ ఫ్లెక్స్ ఓపెనింగ్ కు ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. డిసెంబర్ 2న ఈ మల్టీ ఫ్లెక్స్ గ్రాండ్ గా లాంచ్ కానుంది. దీంట్లో మొత్తం 1638 సీటింగ్ కెపాసిటీ తో 7స్క్రీన్స్ అందుబాటులోకి రానున్నాయి.

ఇక మహేష్ ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ లో నటిస్తూ బిజీ గావున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది. ‘భరత్ అనే నేను’ చిత్రం తరువాత మహేష్ నటిస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు