మహేష్ అడ్వెంచర్స్ మాములుగా లేవుగా..!

Published on Mar 1, 2020 12:38 pm IST

మహేష్ కి ఉన్న భారీ క్రేజ్ రీత్యా ఆయన అనేక వ్యాపార ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు. అందులో థమ్స్ అప్ వంటి ఇంటెర్నేషన్ బ్రాండ్ కి కూడా ఆయన బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు. ఈ బేవరేజ్ బ్రాండ్ యాడ్ కోసం ఇదివరకే అనేక అడ్వెంచరస్ యాక్షన్ సన్నివేశాలలో పాలొన్న మహేష్ తాజా యాడ్ లో మరింత సాహసం చేశారు. ఈజిఫ్టు పిరమిడ్స్ పై నుండి హాట్ ఎయిర్ బెలూన్ పైకి థమ్స్ అప్ కోసం మహేష్ దూకారు. తాజా ఈ యాడ్ ని మహేష్ తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.

సరిలేరు నీకెవ్వరు మూవీతో సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్, కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసుకున్నారు. ఈ చిత్రం 50రోజులు పూర్తి చేసుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక మహేష్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తున్నాడని తెలుస్తున్న నేపథ్యంలో త్వరలో ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారట.

సంబంధిత సమాచారం :

More