ఫుల్ స్వింగ్‌లో ‘బ్రహ్మోత్సవం’ ప్రీ ప్రొడక్షన్

ఫుల్ స్వింగ్‌లో ‘బ్రహ్మోత్సవం’ ప్రీ ప్రొడక్షన్

Published on Jun 29, 2015 2:47 PM IST

bramosthsavam

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. ప్రతిష్టాత్మక పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 31న ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోగా మరో పది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్ళనున్న విషయం తెలిసిందే!

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా జూలై 10నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫస్ట్ షెడ్యూల్‌కు ఇంకా పదిరోజులే ఉన్న నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. విజయవాడ నేపథ్యంలో తెరకెక్కే ఈ ఫ్యామిలీ డ్రామా కోసం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కలిసి ఇప్పటికే లొకేషన్ల ఎంపికను పూర్తి చేయగా పకడ్బందీ స్క్రిప్ట్‌తో మిగిలి ఉన్న కొన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత ముగ్గురు హీరోయిన్లు నటించనుండడం విశేషం! ఇదిలా ఉంటే.. మహేష్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ చివరిదశకు చేరుకుంది. జూలై 18న ‘శ్రీమంతుడు’ ఆడియో విడుదల కానుండగా ఆగష్టు 7న సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు