
‘గజినీ’, ‘సెవెంత్ సెన్స్’, ‘తుపాకి’, ‘స్టాలిన్’ లాంటి సినిమాలు తీసి అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్. మురుగదాస్ లాస్ట్ మూవీ కత్తి తమిళంలో బిగ్గేత్స్ బల్క్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాని చిరు రీమేక్ కూడా చేయడానికి సిద్దమవుతున్నాడు. కాసేపు దీన్ని పక్కన పెడితే శ్రీమంతుడు రిలీజ్ టైంలో మహేష్ బాబు తనకు ఎఆర్ మురుగదాస్గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆయన డైరెక్షన్ లో ఓ ద్విభాషా(తెలుగు, తమిళ్) సినిమా చేయాలని ఉందని తెలిపాడు. ఆ విషయం ఎఆర్ మురుగదాస్ కి కూడా చేరినట్టుంది.
మాకు అందిన సమాచారం ప్రకారం మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి ఎఆర్ మురుగదాస్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మురుగదాస్ మహేష్ బాబు ఇమేజ్ కి సరిపోయే పర్ఫెక్ట్ కమర్షియల్ కథని సిద్దం చేసినట్లు సమాచారం. మురుగదాస్ సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు నెక్స్ట్ సినిమా మురుగదాస్ తోనే ఉండచ్చు, దిల్ రాజు నిర్మిస్తాడని తెలిపారు. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇఈవలె మురుగదాస్ కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఆ ప్రాజెక్ట్ ఇదే కూడా కావచ్చని సమాచారం.

