మహేష్ కుటుంబం నుండి మరొక హీరో !

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు టీడీపీ ఎంపి గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ వెండి తెర అరంగేట్రానికి సిద్దమవుతున్నాడు. అమెరికాలో యాక్టింగ్, ఫిల్మ్ మేకింగ్లో కోర్సులు పూర్తిచేశాడు గల్లా అశోక్.

ఇతన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ ద్వారా లాంచ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సుధీర్ బాబుతో గతంలో ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కృష్ణారెడ్డి గంగదాసు డైరెక్ట్ చేయనున్నాడు. ఈయన గతంలో రాజమౌళి దర్శకత్వ శాఖలో కూడ పనిచేశాడు. ఇకపోతే చిత్ర యూనిట్ సినిమా కోసం శ్రీలంకలో కొన్ని అందమైన లొకేషన్లను ఇప్పటికే సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్..