సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమై కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే పూణే, హైదరబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసిన ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు.
ఈ చిత్ర టీం చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేస్తాయని అంటున్నారు. కేవలం ఫ్యామిలీ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా మహేష్ బాబు నుంచి అభిమానులు కోరుకునే యాక్షన్, కామెడీ కూడా సమపాళ్ళలో ఉండేలా కొరటాల శివ కథని రెడీ చేసారని సమాచారం. కొరటాల శివ తన మొదటి సినిమా మిర్చిలో కూడా కుటుంబ విలువలు చూపుతూనే మాస్ అంశాలను మిక్స్ చేసాడు. అదే రీతిలోనే మహేష్ సినిమా కూడా ఉండనుంది.
శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ మొదటి సారి జోడీ కడుతోంది. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


