పండుగాడు మళ్ళీ దిగుతున్నాడు.

Published on Mar 16, 2020 11:02 am IST

మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో పోకిరి ఒకటి. డైరెక్టర్ పూరి మార్క్ మేనరిజం, రఫ్ ఆటిట్యూడ్ తో మహేష్ ఆ చిత్రంలో సరికొత్తగా కనిపించాడు. టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ లో ఒకటిగా నిలిచిన పోకిరి మూవీ విడుదలై 14ఏళ్ళు పూర్తి అవుతుంది. 2006 ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదలై ఇండస్ట్రీ హిట్ అందుకొంది. పోకిరి విడుదలై 14ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ స్పెషల్ షో ఏప్రిల్ 28న ఏర్పాటు చేస్తున్నారు. అది ఎక్కడ అనే పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

ఇక మహేష్ ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మూవీ విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంది. కాగా మహేష్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ పై సందిగ్దత కొనసాగుతుంది.

సంబంధిత సమాచారం :

More