పాకిస్థాన్ లో బుధవారం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈఎన్నికల్లో నటి మహీరా ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఆమె షూటింగ్ నిమ్మిత్తం విదేశాల్లో ఉండడం వలన వోటింగ్ కు హాజరుకాలేకపోయారు. ఈ విషయాన్ని మహీరా తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అయితే అంతటితో ఆగకుండా ఎన్నికల సమయంలో పాకిస్తాన్లొ ఉండేదుకు చాలా ప్రయత్నించా కానీ కుదరలేదు. ఓటు వేయలేకపోతునందుకు చాలా బాధపడుతున్నాను అని పోస్ట్ చేసింది.
ఇది చూసిన నెటిజన్లు ఎన్నికల తేదీని ఎప్పుడో ప్రకటించిన తన డేట్స్ ను సర్దుబాటు చేసుకోలేకపోవడం ఏంటని మహీరా ఫై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మహీరా ఖాన్ ఇంతకుముందు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ‘రయీస్’ అనే చిత్రంలో నటించింది.


