“రాధే శ్యామ్” నుంచి అసలు ట్రీట్ రాబోతోందా..?

“రాధే శ్యామ్” నుంచి అసలు ట్రీట్ రాబోతోందా..?

Published on Feb 16, 2021 7:03 AM IST

Radhe Shyam 1

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ట్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “రాధే శ్యామ్” మాయలో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసమే ఇన్నాళ్లు ఎంతగానో ఎదురు చూసిన వారికి ఈ 14న ప్రేమికుక దినోత్సవం సందర్భంగా చిన్న గ్లిమ్ప్స్ ను విడుదల చేసారు.

మరి దీనికి మంచి స్పందనే వచ్చింది. కానీ అసలు పండగ ముందు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తాలుకా మెయిన్ కాన్సెప్ట్ టీజర్ ను మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా తొందరలోనే అన్నట్టు వినికిడి. దీని ద్వారా ఆడియెన్స్ కు మరింత డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు