మజిలీ 5 రోజుల్లో ఎంత రాబట్టిందంటే !

Published on Apr 10, 2019 3:59 pm IST

నాగ చైతన్య, సమంత నాల్గవ సారి జంటగా నటించిన చిత్రం మజిలీ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే ఈ చిత్రం చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలుకావడంతో ఆ ప్రభావం మజిలీ ఫై పడింది. దాంతో కలెక్షన్స్ కొంచెం తగ్గిపోయాయి. రేపు కూడా ఈ ప్రభావం కొనసాగనుంది.

అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం మంచి రన్ ను కొనసాగిస్తుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 5రోజుల్లో 21.65 కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :