‘మజిలీ’ ‘చిత్రలహరి ‘ కృష్ణా లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Apr 22, 2019 7:18 pm IST

నాగ చైతన్య – సమంత కలయికలో ఏప్రిల్ 5 న విడుదలైన మజిలీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం కృష్ణా జిల్లాలో ఆదివారం నాడు 2.24 లక్షల షేర్ ను రాబట్టింది. మజిలీ మొత్తం 17 రోజులకు గానూ కృష్ణా జిల్లాలో రూ. 1.74 కోట్ల షేర్ ను రాబట్టింది.

మరొక వైపు, ఏప్రిల్ 12న విడుదలైన సాయి ధరమ్ తేజ్ చిత్రలహరికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఇక ఆదివారం నాడు కృష్ణ జిల్లాలో 1.59 లక్షల రూపాయల వసూళ్ళు చేసింది, మొత్తం 10 రోజులకు గానూ 74.99 లక్షల షేర్ ను రాబట్టింది ఈ చిత్రం.

మొత్తానికి తప్పనిసరిగా హిట్ కావాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఈ హీరోలుకు వాళ్ళ కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ వచ్చాయి. మెయిన్ గా నాగ చైతన్య చాలా సంవత్సరాల తరువాత అక్కినేని అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. అలాగే చిత్రలహరితో వచ్చిన సాయి ధరమ్ తేజ్ కూడా ఆరు పరాజయాల తరువాత.. ఒక సేఫ్ ప్రాజెక్ట్ చేశాడు.

సంబంధిత సమాచారం :