సెన్సేషనల్ హీరో తో మజిలీ డైరెక్టర్ !

Published on Apr 10, 2019 12:02 am IST

నిన్ను కోరి , మజిలీ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ్లాస్టర్ హిట్లు కొట్టాడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ. దాంతో టాలీవుడ్ బడా నిర్మాతల దృష్టి శివ ఫైపడింది. అందులో భాగంగా పలువురు ప్రొడ్యూసర్ లు ఇప్పటికే శివ కు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారట.

ఇక ఈ డైరెక్టర్ తన తదుపరి చిత్రానికి హీరో ను లాక్ చేసి పెట్టాడు. అతను ఎవరో కాదు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవల విజయ్ ని కలిసి స్టోరీ ని వినిపించాడట శివ. వెంటనే విజయ్ కూడా ఓకే చెప్పాడని సమాచారం. మజిలీ నిర్మాతలు హరీష్, సాహూ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది.

సంబంధిత సమాచారం :