మజిలీ గుంటూరు, కృష్ణా లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Apr 14, 2019 6:35 pm IST

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ ఇటీవల విడుదలై మంచి వసూళ్లను రాబడుతుంది. 9రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 50కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి నాగ చైతన్య కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రం నిన్న గుంటూరు లో 8,35,144 లక్షల షేర్ ను రాబట్టి 9రోజుల్లో 1,80,66,910 షేర్ ను కలెక్ట్ చేయగా కృష్ణా లో నిన్న 5,97,690 షేర్ ను రాబట్టి 9రోజుల్లో అక్కడ 1,58,08,051 షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక ఈచిత్రం ఓవర్సీస్ లో కూడా మంచి రన్ ను కొనసాగిస్తుంది. ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా గా శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :