చైతు, సమంత మజిలి’ పీరియాడికల్ స్టోరీనా ?

చైతు, సమంత మజిలి’ పీరియాడికల్ స్టోరీనా ?

Published on Nov 20, 2018 3:56 AM IST

సమంత, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మజిలీ’. గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం ఈ చిత్రం పై అక్కినేని అభిమానుల్లో ఒకింత ఆసక్తి ఏర్పడింది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా పీరియాడికల్ స్టోరీ అని అంటున్నారు. 1990 లో కొన్ని సీన్స్ ఉంటాయట. దానికి కొనసాగింపుగా ఇప్పటి సీన్స్ వస్తుంటాయి. కథ రెండు పార్శ్వాలలో కూడా ఉంటాయట.

ఇక ఈ చిత్రం భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా తెరకెక్కనుందని కూడా తెలుస్తోంది. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు