‘మజిలీ’ అడ్వాన్స్ బుకింగ్ చాలా ఘనంగా.. !

Published on Apr 4, 2019 4:38 pm IST

మొత్తానికి ఈ సమ్మర్ కి పెద్ద సినిమాలు అరడజనుకు పైగానే ఉన్నాయి. ముందుగా మజిలీ రేపు విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క అడ్వాన్స్ బుకింగ్ చాలా ఘనంగా అయినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే యూస్ లో కూడా సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం క్లైమాక్స్ చాలా భావోద్వేగంతో గుండెకు హత్తుకునే విధంగా ఉంటుందట. సినిమా చూసాక ప్రతి భర్త తన భార్య గురించి ఆలోచించే విధంగా సినిమాలో మెసేజ్ ఉంటుందని సమాచారం. మొత్తానికి భార్య గొప్పదనం చెప్పే సినిమా అన్నమాట మజిలీ. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :