‘మజిలీ’ భార్య గొప్పదనం చెప్పే సినిమా !

Published on Mar 18, 2019 10:45 pm IST

భర్తే ప్రాణం అని నమ్మే ఒక మంచి అమ్మాయి, జీవితంలో ఫెయిల్ అయిన ఓ క్రికెటర్ జీవితంలోకి.. భార్యగా వస్తే..? అతనికి ఎలా ఉంటుందో తెలియదు గాని, ఆ అమ్మాయికి మాత్రం టార్చర్ కనబడుతుంది.

అయితే ఆ తరువాత ఆ అమ్మాయి కారణంగానే అతని లైఫ్ ఎలా మారింది, తిరిగి అతను జీవితంలో ఎలా ఎదిగాడు అనే పాయింట్ బేస్ చేసుకుని శివ నిర్వాణ, సమంత – నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా మజిలీ సినిమా రాబోతుంది. మొత్తానికి భార్య గొప్పదనం చెప్పే సినిమా చేస్తున్నామని చెబుతుంది చిత్రబృందం.

కాగా ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇప్పటికే సామ్ – చై మజిలీ సినిమా గురించి పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More