‘మజిలీ’ కృష్ణా 5 రోజుల కలెక్షన్స్ ..!

Published on Apr 10, 2019 10:25 am IST

నాగ చైతన్య – సమంత హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఏప్రిల్ 5వ తేదీన వచ్చిన మజిలీ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద గుడ్ రెవిన్యూను రాబడుతుంది. దాంతో ఇప్పటికే చాలా ఏరియాల్లో మజిలీ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక కృష్ణా జిల్లాలో ఈ చిత్రం ఐదోవ రోజుకు గానూ రూ .10.12 లక్షల షేర్ ను రాబట్టి.. మొత్తం ఐదు రోజులుకు గానూ 1.22 కోట్ల షేర్ ను రాబట్టింది.

కాగా ఈ చిత్రం కృష్ణా లో 1.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. అయితే మజిలీ కలెక్షన్స్ పూర్తయ్యే లోపు అక్కడ రూ. 1.75 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తానికి చైతు – సామ్ కి మజిలీతో మంచి హిట్ రావడం, దానికి తోడు సినిమాలో చైతు నటన సినిమాకే హైలెట్ నిలవడంతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటించింది.

సంబంధిత సమాచారం :