సెన్సార్ చేయించుకున్న ‘మజ్ను’ !

Published on Jan 22, 2019 3:48 am IST

అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన మూడవ చిత్రంగా చేస్తోన్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. తాజాగా ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సిద్ధమైంది.

కాగా ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఫైవ్ మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. ఇక మజ్ను ప్రీ రిలీజ్ వేడుకకు జూ ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా రావడం కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి బాగానే కలిసొచ్చింది.

ఇక ఈ చిత్రం ఫై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More