జి. సీతారెడ్డి నిర్మాణంలో ‘మేజర్‌ చక్రధర్‌’ !

జి. సీతారెడ్డి నిర్మాణంలో ‘మేజర్‌ చక్రధర్‌’ !

Published on May 20, 2019 11:00 AM IST

Majesr

గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎంతవారలైనా’. అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, జి.సీతారెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం సమ్మర్‌ కానుకగా మే 17న అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మే 20 (సోమవారం) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. నిర్మాత, నటుడు జి. సీతారెడ్డి మాట్లాడుతూ – ”మా రామదూత ఆర్ట్స్‌ బ్యానేర్‌ లో నిర్మించిన మొదటి మూవీ ‘ఎంతవారలైన’. విడుదలైన అన్ని సెంటర్స్‌లో ఇంకా ప్రదర్షింపబడుతోంది. నాకు నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు లభించింది. దానికి ప్రేక్షకులతో పాటు మీడియా కూడా ఒక కారణం. అందుకు మీడియా వారికి ధన్యవాదాలు’ అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. మా ప్రొడక్షన్‌లో రెండవ మూవీ ‘మేజర్‌ చక్రధర్‌’ను అనౌన్స్‌ చేస్తున్నాను. ఒక మేజర్‌ ఈ సమాజంలో ఉన్న సమస్యలపై ఎలా స్పందించాడు అన్న పవర్ఫుల్‌ పాయింట్‌ తో ఈ సినిమా మీ ముందుకు వస్తోంది. దేశభక్తితో పాటు ఫ్యామిలీ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు