మన “మేజర్” హవా..పాకిస్తాన్, బంగ్లా దేశాల్లో కూడా నెంబర్ 1.!

మన “మేజర్” హవా..పాకిస్తాన్, బంగ్లా దేశాల్లో కూడా నెంబర్ 1.!

Published on Jul 8, 2022 6:30 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివిశేష్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మేజర్”. రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఒక బీఉతిఫుక్ ట్రిబ్యూట్ గా నిలిచింది. దేశ వ్యాప్తంగా కూడా అందరి మన్ననలు అందుకున్న ఈ సినిమా శేష్ కెరీర్ లో కూడా మంచి వసూళ్లను అందుకున్న సినిమాగా నిలిచింది.

మరి ఈ చిత్రం రీసెంట్ గా ప్రముఖ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రాగా అక్కడ కూడా ప్రపంచ వ్యాప్తంగా హవా కనబరుస్తుంది. మన దేశంలో ఆల్రెడీ టాప్ 1, 2 స్థానాల్లో ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ట్రెండ్ అవుతుండగా ఇప్పుడు పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాల్లో కూడా ఈ జూలై 7 నుంచ్చి ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.

ఈ విధంగా మన మేజర్ కథ ఇంత ఆదరణ అందుకోవడం చిత్ర యూనిట్ సహా అందరికీ కూడా మరింత ఆనందం కలిగించే అంశం అని చెప్పాలి. మరి ఈ సినిమాని మహేష్ సహా ఏ+ఎస్ మూవీస్ మరియు సోనీ పిక్చర్స్ వారు సంయుక్తంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు