డిజప్పాయింట్ అయిన మహేష్ అండ్ మేజర్ టీం.

Published on Mar 15, 2020 11:24 am IST

గత ఏడాది ‘ఎవరు’ సినిమాతో ఓ భారీ థ్రిల్లింగ్ హిట్ అందుకున్నారు హీరో అడివి శేష్. ఆయన తన తదుపరి చిత్రంగా మేజర్ లో నటిస్తున్నారు. 2008 ముంబై టెర్రర్ అట్టాక్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాగా నేడు సందీప్ ఉన్ని కృష్ణన్ జయంతి.

ఈ సందర్భంగా మేజర్ చిత్ర యూనిట్ భారీ సర్ప్రైజింగ్ అప్డేట్స్ సిద్ధం చేసుకొని ఉంచారట. ఐతే కరోనా వైరస్ కారణంగా విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వారు ఈ అప్డేట్స్ వాయిదా వేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మేజర్ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం భారీ కసరత్తు చేసిన అడివి శేషు శారీరకంగా మేకోవర్ కావడంతో పాటు, ఆ పాత్రకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యారు.

సంబంధిత సమాచారం :

More