రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లాస్ట్ మూవీ ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలవడంతో ఆయన ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని రవి కిరణ్ కోలా అనే డైరెక్టర్‌తో చేస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూస్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలవగా, ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఓ గ్లింప్స్ వీడియో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ సాలిడ్ ట్రీట్‌ను డిసెంబర్ 22న సాయంత్రం 7.29 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ ట్రీట్‌తో అభిమానుల ఆకలి తీరడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి రౌడీ జనార్థన్ ట్రీట్ ఎలా ఉండబోతుందో చూడాలి.


