‘పెద్ది’ ఢిల్లీ ఎపిసోడ్ పై హైప్ ఎక్కిస్తున్న మేకర్స్!

‘పెద్ది’ ఢిల్లీ ఎపిసోడ్ పై హైప్ ఎక్కిస్తున్న మేకర్స్!

Published on Jun 3, 2026 3:05 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం “పెద్ది”. తన గత చిత్రం గేమ్ ఛేంజర్ వైఫల్యం నుంచి చరణ్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలకి వస్తున్న నేపథ్యంలో అభిమానులు మేకర్స్ కూడా హైప్ ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో డెఫినెట్ గా ఢిల్లీ ఎపిసోడ్ కోసం అంతా మాట్లాడుకోవడం గ్యారెంటీ అని ఎప్పుడు నుంచో చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. సినిమా షూట్ అక్కడ స్టార్ట్ చేసిన నాటి నుంచి మొన్న ప్రీరిలీజ్ వరకు ఈ ఒక్క ఎపిసోడ్ లో రామ్ చరణ్ పెర్ఫామెన్స్ గాని అందులో ఎమోషన్స్ కూడా ఊహాతీతంగా ఉంటాయని ప్రామిస్ చేశారు.

ఇక లేటెస్ట్ గా ఈ సీక్వెన్స్ తాలూకా కొన్ని స్టిల్స్ ని కూడా వదిలి ఢిల్లీ పోర్షన్స్ మంచి ఎమోషనల్ గా మాత్రమే కాకుండా మంచి మాస్ మూమెంట్స్ తో కూడా ఉంటుంది అని మరింత హైప్ ఎక్కిస్తున్నారు. మరి ఇంతలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ క్రేజీ ఎపిసోడ్ ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో తేలిపోతుంది. ఇక ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు