‘పరాశక్తి’ తెలుగు రిలీజ్‌పై అయోమయం.. అలా చేయడమే బెటర్..!

‘పరాశక్తి’ తెలుగు రిలీజ్‌పై అయోమయం.. అలా చేయడమే బెటర్..!

Published on Dec 25, 2025 12:00 AM IST

Parasakthi

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరాశక్తి’ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాను సుధా కొంగర డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఇప్పుడు తెలుగులో ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో ఇప్పటికే చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ప్రభాస్ ‘ది రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటికి తోడు తమిళ హీరో విజయ్ ‘జన నాయకుడు’ కూడా రిలీజ్ అవుతుంది. ఇన్ని సినిమాలతో పోటీకి దిగడంపై పరాశక్తి మేకర్స్ ఆలోచిస్తున్నారట.

ఒకవేళ సంక్రాంతి బరిలో తెలుగు వెర్షన్ రిలీజ్‌ను వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తే, అది మంచి నిర్ణయం అని చెప్పాలి. ఒకేసారి అన్ని చిత్రాల మధ్య పోటీకి దిగితే, వారు అనుకున్న రీచ్ రాకపోవచ్చు. మరి నిజంగానే ఈ చిత్ర రిలీజ్‌పై మేకర్స్ మరోసారి నిర్ణయం తీసుకుంటారా..? అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు