చిరు 152 కూడా పాన్ ఇండియా లెవెల్ లో ?

chiru1

గతకొన్నేళ్ళుగా తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా విస్తరించింది. దీనితో స్టార్ హీరోలు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభాస్ సాహో, చిరంజీవి సైరా వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలను చేయడం జరిగింది. ఈ రెండు చిత్రాలు మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించబడి దేశవ్యాప్త చర్చకు వేదిక అయ్యాయి. కాగా చిరు తన 152వ చిత్రం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.

ఐతే ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. అందుకే వివిధ పరిశ్రమలకు చెందిన నటులను పాత్రల కొరకు తీసుకోవాలని భావిస్తున్నారట. చిరు గత చిత్రం సైరా అంతటి బడ్జెట్ కాకపోయినప్పటికీ 100కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Exit mobile version